Kotamreddy Sridhar Reddy: తగ్గేదే లేదు.. పోరాడుతూనే ఉంటా: కోటంరెడ్డి

Nellore rural mla Kotamreddy sridhar reddy vows to fight back
  • తన అనుచరులను అక్రమంగా అరెస్టు చేశారన్న కోటంరెడ్డి 
  • పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా హైవేపై తిప్పారని ఆరోపణ 
  • సజ్జల సూచనల ప్రకారం పోలీసులు పనిచేస్తున్నారని వ్యాఖ్య  
తన అనుచరులను అక్రమంగా అరెస్టు చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదని, పోరాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. ‘‘మా అనుచరులు తాటి వెంకటేశ్వర్లు, జావెద్, రఘు, అరెస్టును ఖండిస్తున్నాం. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా హైవేపై తిప్పారు. షాడో సీఎం సజ్జల సూచనల మేరకు పోలీసులు పనిచేస్తున్నారు. నాతో సహా 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసుల వేధింపులకు భయపడను. ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటా..తగ్గేదే లేదు’’ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.
Kotamreddy Sridhar Reddy

More Telugu News