Team India: వందో టెస్టులో పుజారా డకౌట్.. 66/4తో కష్టాల్లో పడ్డ భారత్

Cheteshwar Pujara falls for 0 on his milestone 100th Test match
  • 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు
  • రాహుల్, రోహిత్, పుజారా, శ్రేయస్ ఔట్
  • చెలరేగిపోతున్న ఆసీస్ స్పిన్నర్ నేథన్ లైయన్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ లో తడబడుతోంది. టాపార్డర్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఓవర్ నైట్ స్కోరు 21/0తో మూడో రోజు ఆట కొసాగించిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 46 పరుగుల స్కోరు వద్ద కేఎల్ రాహుల్ (17) ఔటయ్యాడు. ఆ వెంటనే ఒకే ఓవర్లో రోహిత్ శర్మ (32)తో పాటు చతేశ్వర్ పుజారా (0) పెవిలియన్ చేరారు. కెరీర్ లో వందో టెస్టు ఆడుతున్న పుజారా డకౌట్ గా వెనుదిరిగి తీవ్ర నిరాశపరిచాడు. కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) సైతం పెవిలియన్ చేరడంతో 25.2 ఓవర్లకే 66/4తో ఎదురీత మొదలు పెట్టింది.

క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాపైనే ఆశలున్నాయి. భారత్ కోల్పోయిన వికెట్లన్నీ ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నేథన్ లైయన్ ఖాతాలో పడ్డాయి. కాగా, తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజ (81), పీటర్ హ్యాండ్స్ కోంబ్ (72 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా..జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు.
Team India
Cheteshwar Pujara
0
100th test

More Telugu News