Hyderabad: రూ.1800 విషయంలో భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య

Hyderabad Man commits suicide after dispute with wife over rs 1800
షార్ట్స్‌లో చూడండి
డబ్బు విషయంలో భార్యతో గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ పరిధిలోని కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కార్వాన్ సత్యనారాయణ కాలనీకి చెందిన జగ్గేటి కిషన్, శ్యామల దంపతులకు ముగ్గురు కూతుళ్లు. కిషన్ ఓ కబేళాలో పనిచేస్తున్నాడు. పెద్ద కూతురి వివాహం అయ్యింది. 

అయితే.. ఈ నెల 15న రూ. 1800 విషయంలో భార్య శ్యామలతో గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత.. కుటుంబసభ్యులు అతడికి ఫోన్ చేస్తే త్వరగా వస్తానని చెప్పిన కిషన్.. పొద్దుపోయినా తిరిగిరాలేదు. ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం కార్వాన్ రాంసింగ్‌పురా చౌరస్తా సమీపంలోని మూసీనది ఒడ్డున ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కిషన్‌ను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Hyderabad

More Telugu News