Union Government: ఖలిస్థాన్ టైగర్స్, గజ్నవీ ఫోర్స్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

Centre bans Khalistan Tigers and Ghagnavi Force
  • ఉగ్ర సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం
  • పాక్ ప్రేరేపిత సంస్థల వ్యక్తులతో ఏర్పాటైన జమ్మూకశ్మీర్ గజ్మవీ ఫోర్స్
  • స్వతంత్ర పంజాబ్ కావాలంటున్న ఖలిస్థాన్ టైగర్స్
మన దేశానికి వ్యతిరేకంగా పని చేస్తూ, మన దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఉగ్ర సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జమ్మూకశ్మీర్ గజ్నవీ ఫోర్స్, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ లను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల వ్యక్తులతో జమ్మూకశ్మీర్ గజ్మవీ ఫోర్స్ ఏర్పాటైన విషయం గమనార్హం. 

పంజాబ్ ను ప్రత్యేక దేశంగా విడగొట్టాలంటూ దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్. ఈ రెండింటినీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం... వాటిపై నిషేధం విధించింది. అంతేకాదు... పంజాబ్ కు చెందిన హర్వీందర్ సింగన్ సంధు అలియాస్ రిండా ను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రిండాకు పాకిస్థాన్ లోని లాహార్ లోని నిషేధిత ఖలిస్థానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తో సంబంధాలు ఉన్నాయని తెలిపింది.
Union Government
Terrorist organisations
Ban

More Telugu News