Ambati Rambabu: చంద్రబాబు పాపాల వల్లే పోలవరంకు ఈ దుస్థితి: మంత్రి అంబటి రాంబాబు

TDP destroyed Polavaram dam says Ambati
  • పోలవరంను పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్న మంత్రి 
  • టీడీపీ హయాంలో పోలవరంను నాశనం చేశారని విమర్శ 
  • చంద్రబాబుకు ప్రచార యావ తప్ప మరేమీ లేదన్న అంబటి 
ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ధనలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో అంబటి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో కాఫర్ డ్యామ్ నిర్మించకుండానే డయాఫ్రం వాల్ నిర్మించారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని అన్నారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే పోలవరంకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. చంద్రబాబుకు ప్రచార యావ తప్ప మరేమీ లేదని అన్నారు.
Ambati Rambabu
YSRCP
Chandrababu
Telugudesam
Polavaram Project

More Telugu News