Russia: 16వ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందిన రష్యా అధినేత పుతిన్ సన్నిహితురాలు

  • ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్న కీలక వ్యక్తులు
  • తాజాగా వెస్టర్న్ మిలిటరీ డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ డైరెక్టర్ మరీనా మృతి
  • తన భర్త అపార్ట్ మెంట్ నుంచి కిందపడి దుర్మరణం
Putin aid Marina dead

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కు సన్నిహితురాలు, ఆ దేశ రక్షణ శాఖకు చెందిన ఫైనాన్సియల్ సపోర్ట్ డిపార్ట్ మెంట్ చీఫ్ అయిన మరీనా యాంకినా దుర్మరణం చెందారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఒక బహుళ అంతస్తుల భవనం 16వ అంతస్తు నుంచి కింద పడి ఆమె మృతి చెందారని 'ది ఇండిపెండెంట్' వెల్లడించింది. పేవ్ మెంట్ మీద ఆమె మృతదేహాన్ని పక్కనే ఉన్న ఒక రెసిడెన్సియల్ కాంప్లెక్స్ లోని ఒక వ్యక్తి గుర్తించారు. 

మరీనా వయసు 58 ఏళ్లు. ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో ఆమె రష్యా కోసం నిధులను సేకరిస్తున్నారు. రష్యాకు చెందిన ఐదు జాగ్రఫికల్ బెటాలియన్స్ లో వెస్టర్న్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కు ఆమె ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉన్నారు. మెట్రో న్యూస్ కథనం ప్రకారం ఆ భవనంలో ఆమె నివసించడం లేదు. ఆ భవంతిలో ఆమె భర్త అపార్ట్ మెంట్ ఉంది.   

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎంతో మంది ప్రముఖ రష్యన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తాజా మరణం మరీనాది కావడం గమనార్హం. ఇటీవలే మేజర్ జనరల్ వ్లాదిమిర్ మకరోవ్ ను పుతిన్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయన అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత మరీనా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.

More Telugu News