KCR: కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, తమిళిసై

Modi and Tamilisai greetings to KCR
  • నేడు 69వ వసంతంలోకి అడుగుపెట్టిన కేసీఆర్
  • వెల్లువెత్తుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు
  • కేసీఆర్ కు ఆయురారోగ్యాలు ఉండాలన్న మోదీ

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం. ఈరోజు ఆయన 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ కు ప్రధాని మోదీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. 'తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పూర్తి ఆయుష్షుతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా' అని మోదీ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అని తమిళిసై ట్వీట్ చేశారు. 

  • Loading...

More Telugu News