Team India: ఒకే పేసర్, ఏకంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా

  • రెండో టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • సూర్యకుమార్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్
  • ఈ మ్యాచ్ లో గెలిస్తే టెస్టుల్లో అగ్రస్థానంలోకి రానున్న భారత్
Australia chose to battting in 2nd test

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ టాస్ కోల్పోయింది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కేవలం ఒక్క పేసర్, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. బ్యాటర్ రెన్ షా స్థానంతో ట్రావిస్ హెడ్ ను తిరిగి జట్టులోకి తీసుకుంది. పేసర్ బోలాండ్ స్థానంలో స్పిన్నర్ కునేమన్ ను తుది జట్టులో చేర్చింది. అతను ఈ టెస్టుతో అరంగేట్రం చేయనున్నాడు. 

మరోవైపు భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయం నుంచి కోలుకున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అతడిని తీసుకున్నట్టు రోహిత్ శర్మ చెప్పాడు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ నెగ్గిన భారత్ ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకుంటుంది. ఇప్పటికే వన్డే, టీ20ల్లో టాప్ ర్యాంక్ లో ఉన్న టీమిండియా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ గా నిలుస్తుంది.

More Telugu News