Kiran Abbavaram: అరవింద్ గారి చేతిలో పడిన తరువాత హిట్టు కాకుండా ఎలా ఉంటుంది?: ఎల్బీ శ్రీరామ్

  • ప్రేమకథా చిత్రంగా 'వినరోభాగ్యము విష్ణుకథ'
  • తిరుపతి నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా కశ్మీర పరదేశి 
  • ఈ నెల 18న రిలీజ్ అవుతున్న సినిమా 
Vinaro Bhagyamu Vishnu katha pre release event

తిరుపతి నేపథ్యంలో సాగే కథా కథనాలతో 'వినరోభాగ్యము విష్ణుకథ' సినిమా రూపొందింది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి, కిశోర్ దర్శకత్వం వహించాడు. కశ్మీర కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - నెక్లెస్ రోడ్ లోని 'పీపుల్స్ ప్లాజా'లో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు.

అఖిల్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ  ప్రీ రిలీజ్ ఈవెంటులో, చాలా గ్యాప్ తరువాత ఎల్బీ శ్రీరామ్ కనిపించారు. స్టేజ్ పై ఆయన మాట్లాడుతూ .. "నేను సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు ఓ కుర్రాడు షార్ట్ ఫిలిమ్స్ తో బిజీగా ఉన్నాడు. నేను షార్టు ఫిలిమ్స్ కి వెళ్లిపోయిన తరువాత ఆ కుర్రాడు సినిమాల్లో బిజీ అయ్యాడు .. ఆ కుర్రాడే కిరణ్ అబ్బవరం" అన్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ కశ్మీర పరదేశి అంటున్నారు .. ఇక్కడి కుర్రాడితో సినిమా చేసిన తరువాత పరదేశి ఎలా అవుతుంది? స్వదేశీనే అంటూ నవ్వించారు. అల్లు అరవింద్ గారు ఎప్పటికప్పుడు నన్ను గుర్తిస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. నేను దర్శక నిర్మాతగా చేసిన 'కవి సామ్రాట్'ను ఆయన 'ఆహా' కోసం తీసుకున్నారు .. అదే నాకు ఆనందం" అని చెప్పారు. 

"కాస్త యాక్టివ్ గానే ఉన్నాను కదా .. సినిమాలు చేద్దామని అనుకుంటున్న సమయంలో నన్ను పిలిపించి ఈ సినిమాలో మంచి వేషం వేయించారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లడానికి నాకు అవకాశం లభించింది. అల్లు అరవింద్ గారి చేతిలో పడిన తరువాత ఈ సినిమా హిట్ కాకుండా ఎలా ఉంటుంది? కాకపోతే 100 రోజులు ఆడేది 200 ల రోజులు ఆడుతుందేమో" అంటూ చమత్కరించారు. 

More Telugu News