Chandrababu: మమ్మల్ని నమ్ముకున్న వాళ్లు నిస్సహాయ స్థితిలో ఉంటే ఏం చేయలేకపోతున్నాం: చంద్రబాబు

  • పెద్దాపురంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి
  • హాజరైన చంద్రబాబు
  • ప్రజలు కష్టాల్లో ఉంటే ఎంజాయ్ చేస్తున్నాడని జగన్ పై ధ్వజం
  • ఇది సైకో లక్షణం అని వెల్లడి
  • 1000 శాతం జగన్ ఓడిపోవడం ఖాయమని వెల్లడి
Chandrababu speech in Peddapuram

కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని అన్నారు. వచ్చి నాలుగేళ్లయినా ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజలు ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారని వెల్లడించారు. 

ప్రజలు కష్టాల్లో ఉంటే తాను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడని అన్నారు. ఇది సైకో లక్షణం అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. అధికార యంత్రాంగం, రౌడీలను ఉపయోగించి ప్రజల అభిప్రాయాలను జగన్ మార్చాలనుకుంటున్నాడని, ఎన్ని చేసినా 1000 శాతం జగన్ ఇంటికి పోవడం ఖాయమని స్పష్టం చేశారు. 

దేశంలోనే అధిక ధరలు ఉండే రాష్ట్రం ఏపీనే అని వెల్లడించారు. అధికారం అనే రాయితో ప్రతిపక్షాలను, ప్రజలను కొడుతున్నాడని, చివరికి తనకు తానే కొట్టుకుంటాడని ఎద్దేవా చేశారు. ఏం చేస్తున్నాడో, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ ను చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీలు ముందుకొస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ను చూసి పిక్ పాకెట్ గాళ్లు, పేటీఎం బ్యాచ్ వాళ్లు వస్తారని సెటైర్ వేశారు. 

టీడీపీ అంటే సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం, మహిళల రక్షణ అని వివరించారు. వైసీపీ అంటే దొంగ మద్యం, జే బ్రాండ్లు, బ్లేడ్ బ్యాచ్ అని విమర్శించారు. రాష్ట్రంలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు... నేను ఎప్పుడైనా కరెంట్ చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలు పెంచకుండా పాలించిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో 48 రకాల పన్నులు వేసిన ఘనుడు ఈ ఘరానా దొంగ జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఇంత నిస్సహాయ స్థితిలో ఉంటే ఏం చేయలేకపోతున్నామన్న బాధ, ఆవేదన కలుగుతోందని చెప్పారు.

More Telugu News