Gudivada Amarnath: విశాఖ ఏపీకి కొత్త రాజధాని కాబోతోంది: మంత్రి అమర్నాథ్

Amarnath says Visakha becomes AP Capital
  • మరోసారి తీవ్ర చర్చకు దారితీసిన ఏపీ రాజధాని అంశం
  • విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్
  • హాజరైన ఏపీ మంత్రులు, పలు దేశాల ప్రతినిధులు
  • వేగంగా ఎదుగుతున్న నగరాల్లో విశాఖ ఒకటన్న అమర్నాథ్
ఏపీ రాజధాని అంశంపై వైసీపీ నేతల వ్యాఖ్యలు, నిర్వచనాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజని, పీడిక రాజన్నదొర తదితరులు హాజరయ్యారు. పలు దేశాల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఔషధాల లభ్యత, డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, విశాఖ ఏపీకి కొత్త రాజధాని కాబోతోందని తెలిపారు. త్వరలో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుందని వెల్లడించారు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.
Gudivada Amarnath
Visakhapatnam
AP Capital
YSRCP
Andhra Pradesh

More Telugu News