Telangana: అందుకే మా నీటిపారుదల శాఖ అధికారులతో తెలంగాణ పర్యటనకు వచ్చాం: పంజాబ్ సీఎం

  • తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో ఉన్న భగవంత్ మాన్
  •  సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను 
    పరిశీలించిన పంజాబ్ ముఖ్యమంత్రి
  • ఈ సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం      
we will get information about the technology of saving underground water says Punjab CM Mann

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ను ఈ రోజు పరిశీలించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నీటి పారుదల ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కొండ పోచమ్మ రిజర్వాయర్ చేరుకున్నారు. ప్రాజెక్టును నిశితంగా పరిశీలించి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

‘పంజాబ్‌లోని నీటిని కాపాడేందుకు నిమగ్నమై ఉన్నాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి సమాచారం తెలుసుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి తెలంగాణ డ్యామ్‌ను పరిశీలించేందుకు వచ్చాం’ ఆయన ట్వీట్ చేశారు. 

భూగర్భ జలాలను ఆదా చేసే సాంకేతికత గురించి సమాచారాన్ని తెలుసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భూగర్భ జలాలను కాపాడేందుకు గ్రామాల్లో చిన్న డ్యామ్‌లు నిర్మించిందని, వాటి వల్ల ఇక్కడ భూగర్భ జలాలు 2 మీటర్ల వరకు పెరిగాయన్నారు. అనంతరం మర్కుక్ మండలం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్ డ్యాంను పరిశీలిస్తారు. ఆ తర్వాత మల్లన్ సాగర్, గజ్వేల్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ గా  అభివృద్ధి చెందిన పాండవుల చెరువుని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.

More Telugu News