HMD Global: నోకియా ఎక్స్ 30, ఒప్పో ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ విడుదల

HMD Global just launched Nokia X30 5G for a price of Rs 48999
  • నోకియా ఎక్స్ 30 ధర రూ.48,999
  • ఈ నెల 20న అమెజాన్ లో విక్రయాలు మొదలు
  • ఒప్పో ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ అంతర్జాతీయంగా విడుదల
  • భారత్ లో విక్రయ ధరపై త్వరలో ప్రకటన
స్మార్ట్ ఫోన్ ప్రియులకు రెండు ప్రీమియం ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా ఎక్స్30 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వచ్చే దీని ధర రూ.48,999. ఇది కూడా పరిమిత కాలం పాటు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ధర పెరుగుతుంది. 

నోకియా ఎక్స్ 30 5జీ ఫోన్ లో 6.43 అంగుళాల అమోలెడ్ ప్యూర్ డిస్ ప్లే, 90హెర్జ్ రీఫ్రెష్ రేటు, స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. ప్యూర్ డిస్ ప్లే మరింత బ్రైట్ నెస్, ప్రభావవంతమైన రంగులకు సపోర్ట్ చేస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ తెలిపింది. 

వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ లో గోప్రో క్విక్ యాప్ ఇన్ స్టాల్ చేసి ఉంటుంది. దీని సాయంతో యూజర్లు ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి, తమ సృజనాత్మకత చాటుకోవచ్చు. 33 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. ఫిబ్రవరి 20 నుంచి అమెజాన్ లో విక్రయాలు జరుగుతాయి.

ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్ అంతర్జాతీయంగా విడుదల చేసింది. ఒప్పో నుంచి ఇది తొలి ఫోల్డబుల్ ఫోన్. ఈ ఫోన్ ప్రధాన డిస్ ప్లే 6.8 అంగుళాల సైజుతో, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు పైన కనిపించే స్క్రీన్ 3.26 అంగుళాల సైజుతో ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్ సెట్ పై పనిచేస్తుంది. 

50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా వెనుక భాగంలో ఉంటుంది. 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా, 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ చార్జర్ తో వస్తుంది. ఈ ఫోన్ భారత్ లో విక్రయ ధరను ఒప్పో ఇంకా ప్రకటించలేదు.
HMD Global
price of Rs 48999
Nokia X30 5G
Oppo Find N2 Flip

More Telugu News