ఆర్టీసీ బస్సెక్కిన నారా లోకేశ్... ప్రయాణికులతో మాటామంతీ

  • సత్యవేడు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • పిచ్చాటూరు వద్ద బస్సెక్కిన లోకేశ్
  • ప్రయాణికులతో చార్జీల అంశం మాట్లాడిన వైనం
  • ఇప్పటిదాకా మూడుసార్లు చార్జీలు పెంచారని వెల్లడి
  • చంద్రబాబు హయాంలో ఒక్కసారి కూడా పెంచలేదని స్పష్టీకరణ
Lokesh get into RTC Bus

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రకు ఇవాళ 20వ రోజు. కాగా, పిచ్చాటూరులో పాదయాత్ర సందర్భంగా లోకేశ్ అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సులోకి ఎక్కారు. 

ప్రయాణికులతో మాట్లాడుతూ చార్జీల అంశం ప్రస్తావించారు. ఇప్పటిదాకా మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని లోకేశ్ అన్నారు. అన్నీ పెరుగుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా బస్సు చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి సెల్ఫీలు దిగారు. జాగ్రత్త అమ్మా... వెళ్లొస్తా... అంటూ ప్రయాణికుల నుంచి వీడ్కోలు తీసుకున్నారు.

More Telugu News