Kuthuhalamma: కుతూహలమ్మ మృతికి సీఎం జగన్, చంద్రబాబు సంతాపం

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత
  • విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • కుతూహలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భావిస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్
YS Jagan and Chandrababu condolences to the demise of Kuthuhalamma

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ ఈ వేకువజామున అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 74 ఏళ్ల కుతూహలమ్మ తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ఏపీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు సంతాపం స్పందించారు. 

ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ మృతి పట్ల సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారని సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారని వివరించింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా సేవలందించిన కుతూహలమ్మ గారి మృతికి సంతాపం తెలియజేస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు. కుతూహలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

More Telugu News