Anikha Surendran: 'బుట్టబొమ్మ' ఫ్లాప్ కి కారణాలు ఇవే: సూర్యదేవర నాగవంశీ

  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'బుట్టబొమ్మ'
  • అంచనాలను అందుకోలేకపోయిన సినిమా 
  • రీమేక్ హక్కులు తీసుకున్నప్పుడు పరిస్థితి వేరన్న నిర్మాత 
  • సూర్యను తీసుకోవడానికి అదే కారణమని వెల్లడి  
Suryadevara Nagavamshi Interview

సితార బ్యానర్లో ఇటీవల వచ్చిన 'బుట్టబొమ్మ' ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందలేకపోయింది. గ్రామీణ నేపథ్యంలోని ప్రేమకథగా యూత్ ను ఆకట్టుకుంటుందని అనుకుంటే, అందుకు ఈ సినిమా దూరంగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. 

"2020లో 'బుట్టబొమ్మ' సినిమా రీమేక్ హక్కులను తీసుకున్నాము .. 2023లో విడుదల చేశాము. ఈ గ్యాపులో ప్రేక్షకుల అభిరుచికి సంబంధించిన సినారియో మారిపోయింది. అందువలన ఆడియన్స్ ఈ సినిమాను రిసీవ్ చేసుకోలేదు. నేను .. త్రివిక్రమ్ కలిసి ఈ సినిమాను ముందుగానే చూశాము. ఇది థియేటర్స్ కి వెళ్లవలసిన సినిమా కాదని మాకు అప్పుడే అర్థమైంది. కానీ చివరి నిమిషంలో ఏమీ చేయలేని పరిస్థితి" అన్నారు. 

"ఈ సినిమాలో అర్జున్ దాస్ పాత్ర కోసం విష్వక్సేన్ ను అనుకున్నాము. కానీ క్లైమాక్స్ ను ఆడియన్స్ గెస్ చేస్తారని మానుకున్నాము. ఇక ఆటో డ్రైవర్ పాత్రకి సిద్ధూ జొన్నలగడ్డను తీసుకోవాలనుకున్నాము .. కానీ ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సూర్య మా బ్యానర్లోని సినిమాలకి కో డైరెక్టర్ గా పనిచేసిన సత్యం గారి అబ్బాయి. ఆయన చివరి కోరిక మేరకు సూర్యకు ఛాన్స్ ఇచ్చాము. డబ్బు విషయాన్ని పక్కన పెడితే, మా అంచనాలను అందుకోకుండా నిరాశ పరిచిన సినిమా ఇది" అని చెప్పుకొచ్చారు. 


More Telugu News