Elon Musk: తన పెంపుడు కుక్కను ట్విట్టర్​ సీఈఓ కుర్చీలో కూర్చోబెట్టిన మస్క్!

Elon Musk introduces new Twitter CEO says he is much better than Parag Agrawal
  • గత సీఈఓ పరాగ్ కంటే మెరుగ్గా పని చేస్తుందని వ్యాఖ్య
  • ట్విట్టర్ తన చేతికి రాగానే పరాగ్, ఇతరులను తొలగించిన మస్క్
  • మరోసారి పరాగ్ పై అక్కసు వెళ్లగక్కిన వైనం
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెంపుడు కుక్క ఫ్లోకిని ట్విట్టర్‌ సీఈఓ కుర్చీలో కూర్చొబెట్టారు. దీనికి సీఈఓ అని రాసి ఉన్న టీ షర్ట్ను తొడిగారు. ట్విట్టర్ కొత్త సీఈఓ ఇతనే అంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఇదివరకు సీఈఓగా పని చేసిన భారతీయుడు పరాగ్ అగర్వాల్ కంటే తన కుక్క ఫ్లోకినే మెరుగ్గా పని చేస్తుందన్నారు. తద్వారా పరాగ్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు.

 న్యాయపోరాటం తర్వాత ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న మస్క్ అందులో పని చేస్తున్న కీలక వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు. ఈ డీల్ పూర్తయిన వెంటనే అగర్వాల్‌ ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ ఓ నెల్ సెగల్ ను తొలగించారు. వారిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ తన చేతిలోకి రాగానే అనేక మార్పులు చేశారు.
Elon Musk
CEO
dog
Parag Agrawal
Twitter

More Telugu News