Hardik Pandya: రెండోసారి పెళ్లి ముచ్చట తీర్చుకున్న హార్థిక్ పాండ్యా

Hardik Pandya Natasa Stankovic get remarried in Udaipur
  • రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వేలంటైన్స్ డే నాడే పెళ్లి వేడుక
  • బంధు మిత్రుల సమక్షంలో మరోసారి ఒక్కటైన జంట
  • 2020లో వీరి తొలి వివాహం
ప్రముఖ క్రికెటర్ హార్థిక్ పాండ్యా మరోసారి పెళ్లి వేడుక చేసుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న హార్థిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ ఉదయ్ పూర్ లో ఘనంగా పెళ్లి సందడి జరుపుకున్నారు. వీరిద్దరూ ఇప్పటికే భార్యాభర్తలు కాగా, వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2020లోనే తమ వివాహాన్ని వీరు రిజిస్టర్ చేసుకున్నారు. ప్రేమ వివాహం కావడంతో అప్పుడు ఎక్కువ మందిని పిలవలేదు. దీంతో మరోసారి ఘనంగా అందరి సమక్షంలో పెళ్లి వేడుక నిర్వహించుకున్నారు.

తెల్లటి గౌన్ ధరించిన నటాషా, వైట్ షర్ట్, బ్లాక్ సూట్ తో పాండ్యా దర్శనమిచ్చారు. ‘‘మూడేళ్ల క్రితం మేము చేసుకున్న హామీలను మరోసారి పునరుద్ధరించుకోవడం ద్వారా ఈ ప్రేమ దీవిలో వేలంటైన్స్ డేని జరుపుకున్నాం. ప్రేమ వేడుక జరుపుకునే సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు మా వెంట ఉండడం అదృష్టం’’ అంటూ హార్థిక్ పాండ్యా, నటాషా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
Hardik Pandya
Natasa
Stankovic
remarried

More Telugu News