Tummalapalli Kalakshetram: తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరు మార్పుపై కమిషనర్ వివరణ

Vijayawada municipal commissioner says they not intended to change Tummalapalli Kalakshetram name
  • విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రానికి పేరు మార్పు అంటూ కథనాలు
  • పేరును మార్చే ఉద్దేశం లేదన్న నగరపాలక కమిషనర్
  • పునరుద్ధణ పనుల్లో భాగంగా పేరులో కొంత భాగం తొలగించినట్టు వెల్లడి 
సాహితీ సదస్సులకు, సమావేశాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆతిథ్యమిచ్చిన విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరుమార్పు అంటూ పత్రికల్లో కథనాలు రావడం తెలిసిందే. దీనిపై నగరపాలక కమిషనర్ వివరణ ఇచ్చారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 

పునర్ నిర్మాణ సమయంలో ఎలివేషన్ భాగం పునరుద్ధరించేందుకు పేరు తొలగించామని వివరణ ఇచ్చారు. నేమ్ బోర్డు తయారు కాగానే అతి త్వరలో పూర్తి పేరును ఏర్పాటు చేస్తామని తెలిపారు. పనులు పూర్తయ్యాయని, నేమ్ బోర్డు ఏర్పాటు చేయడమే మిగిలుందని వివరించారు. పేరును హైలైట్ చేయడానికి గ్లో సైన్ బోర్డుతో రూపొందించినట్టు కమిషనర్ వెల్లడించారు.
Tummalapalli Kalakshetram
Municipal Commissioner
Name Change
Vijayawada

More Telugu News