డయాబెటిస్‌ బాధితుల కోసం మొబైల్ యాప్‌ ‘ఎంవీ డయాబెట్’

  • ఎంవీ హాస్పిటల్, మరో పరిశోధనా సంస్థ కలిసి యాప్ కు రూపకల్పన
  • ప్లే స్టోర్ లో ‘ఎంవీ డయాబెట్’ పేరుతో అందుబాటులో ఉందన్న నిపుణులు
  • మధుమేహ బాధితులు తమ సందేహాలను ఈ యాప్ ద్వారా పరిష్కరించుకోవచ్చు
MV DIABET is An Application to help diabetics has been Launched

మధుమేహ బాధితుల కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎంవీ హాస్పిటల్, ప్రొఫెసర్ ఎం.విశ్వనాథన్ డయాబెటిక్ రీసెర్చ్ సెంటర్ సంయుక్తంగా ఈ యాప్ ను అభివృద్ధి చేశాయి. మధుమేహ బాధితులు తమకు తరచూ ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, వాటికి పరిష్కారాలను ఈ యాప్ తో తెలుసుకోవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ యాప్ ద్వారా నిపుణలను సంప్రదించవచ్చు. ఈ యాప్ ను శనివారం మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్లే స్టోర్ లో ఈ యాప్ అందుబాటులో ఉందని డయాబెటీస్ వైద్య నిపుణుడు డాక్టర్ విజయ్ విశ్వనాథన్ చెప్పారు.

వాట్సాప్ నంబర్ కు కనెక్ట్ అయిన ఈ యాప్ ద్వారా తమ వైద్య బృందం సలహాలు సూచనలు అందిస్తుందని వివరించారు. మధుమేహ బాధితులు కొన్ని రకాల నరాల సంబంధిత వ్యాధులకు గురవుతుంటారని డాక్టర్ విజయ్ విశ్వనాథన్ చెప్పారు. రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని వివరించారు. దీని ప్రభావంతో రక్తనాళాల గోడలకు నష్టం కలుగుతుందని, తీవ్రమైన నొప్పికి కారణమవుతుందని విశ్వనాథన్ వివరించారు.

More Telugu News