Rana Daggubati: ప్రేమికులరోజు సందర్భంగా రానా భార్య మిహీక భావోద్వేగం

Miheeka Bajaj Valentines Day greetings to Rana
  • రానాకు ప్రేమికులరోజు శుభాకాంక్షలు తెలిపిన మిహీక
  • నీ నవ్వు నన్ను మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుందని వ్యాఖ్య
  • హ్యపీ వాలంటైన్స్ డే అంటూ ఇన్స్టాలో పోస్ట్
ఈరోజు అంతర్జాతీయ ప్రేమికుల దినోత్సవం. ఈ సందర్భంగా తన భర్త, సినీ నటుడు రానాను ఉద్దేశించి ఆయన భార్య మిహీకా బజాజ్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. తన కలల మనిషికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అని ఆమె ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. 'స్ట్రాంగ్, స్వీట్, అందం, అద్భుతం ఇలా నా గురించి చెప్పుకుంటూ పోవడానికి పదాలు చాలడం లేదు. నీవు నన్ను ఎంతో ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు. సరదాగా అంటున్నా. నీ పనుల నిమిత్తం నీవు నాకు చాలా రోజులు దూరంగా ఉంటూ నన్ను బాధ పెట్టొచ్చు. కానీ నీ ఆ నవ్వు నన్ను మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే' అని ఇన్స్టాలో తన ప్రేమను వ్యక్తపరిచారు.
Rana Daggubati
Miheeka Bajaj
Tollywood
Valentines Day

More Telugu News