Nara Lokesh: కల్తీ మద్యం పిచికారీ చేస్తే పొలాల్లోని పురుగులు చనిపోతున్నాయి: లోకేశ్ సెటైర్లు

  • నగరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • పేదల ద్రోహి జగన్ అంటూ లోకేశ్ ఫైర్
  • రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడని విమర్శలు
  • సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ నినాదం
Lokesh Yuvagalam padayatra 18yh day details

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం 18వ రోజు పాదయాత్ర నగరి నియోజకవర్గంలో కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు చినరాజకుప్పం శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎదుట ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి జనం పెద్దఎత్తున హాజరయ్యారు. 

పుత్తూరు శివార్లలో భారీ గజమాలతో యువనేతను నగరి నియోజకవర్గ కార్యకర్తలు సత్కరించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగింది. పాదయాత్రకు వచ్చిన జనంతో జాతీయ రహదారి కిటకిటలాడి ట్రాఫిక్ జామ్ అయింది. 


లోకేశ్ ప్రసంగం వివరాలు...

పేదలద్రోహి జగన్ 

జగన్ అధికారంలోకి వచ్చాక పేదలకు వరమైన విదేశీ విద్య కట్ చేశాడు. 77 జీవో తెచ్చి ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేశాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు రూ.20 వేల కోట్లు పసుపు కుంకుమ ద్వారా అందించారు. జగన్ వచ్చాక పెంచుకుంటూ పోతా అన్నాడు.. గ్యాస్, నూనె, పంచదార, ఉప్పు, ఇంటి పన్ను పెంచుకుంటూ పోతున్నాడు. అమ్మఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తానన్నాడు. కానీ ఒకరికే ఇస్తున్నాడు. 

సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు... చేశాడా? ఆంధ్రాగోల్డ్, బూమ్ బూమ్ తీసుకొచ్చాడు. ఈ మందు తాగి ఆసుపత్రుల పాలవుతున్నారు. కల్తీ మద్యం పిచికారీ చేస్తే పొలాల్లోని పురుగులు చనిపోతున్నాయి. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. చాలీచాలని పెన్షన్ రూ.2 వందలుంటే చంద్రబాబు రూ.2 వేలు చేశారు. ఈ కంత్రీ సీఎం రూ.3వేలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా? పెన్షన్ దారులు జగన్ మోసంతో పేదలు రూ.30 వేలు కోల్పోయారు.

మోటార్లకు మీటర్లు అన్నదాతకు ఉరితాళ్లే!

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు. గిట్టుబాటు ధర అందించారు. రాయలసీమకు డ్రిప్ ఇరిగేషన్ తెచ్చారు. పాడి రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ ఇచ్చారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించారు. కానీ ఈ జగన్ రెడ్డి ఏం చేశారు? రైతు భరోసాతో ఐదేళ్లకు రూ.30 వేలు మాత్రమే ఇస్తున్నాడు. మామిడి, చెరకు రైతులకు గిట్టుబాటు ధర లేదు. పాడి రైతులకు ఇస్తానన్న రూ.4 బోనస్ మర్చిపోయాడు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. రైతుల మీటర్లకు మోటార్లు బిగిస్తే వారికి ఇక ఉరితాడే.

సీమకు జగన్ అన్యాయం చేస్తున్నాడు

రాయలసీమకు ఈ సీఎం అన్యాయం చేస్తున్నాడు. ఒక్కసాగు నీటి ప్రాజెక్టైనా పూర్తి చేశాడా? ఒక్క పరిశ్రమైనా తెచ్చాడా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా? చిత్తూరులో పెద్దపరిశ్రమ అమర్ రాజాను తెలంగాణకు తరిమేశాడు. దీంతో 10 వేల ఉద్యోగాలు పోయాయి. అంబానీతో మాట్లాడి తిరుపతికి తీసుకొచ్చిన రిలయన్స్ తెలంగాణకు తరిమాడు. దీంతో మరో 50 వేల ఉద్యోగాలు పోయాయి. అన్నమ్మయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 62 మంది చనిపోయారు. వాళ్లకు ఇప్పటికీ న్యాయం చేయలేదు. హంద్రీనీవాకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతుంది... దాన్ని కూడా వదిలేశాడు. జగన్ సీఎం అయ్యాక... అన్నా క్యాంటీన్ పీకాడు... చంద్రన్న బీమా, చంద్రన్న కానుకలు పీకాడు. బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు పీకేశాడు. 

ఉద్యోగులకు చంద్రబాబు ఉన్నప్పుడు పండగలా ఉంది. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. కానీ జగన్ వచ్చి ఉన్న ఫిట్మెంట్ పీకేశాడు. నెలనెలా జీతం పడటంలేదు. జీతం కోసం ఎదురు చూసే పరిస్థితి. అప్పులు, గంజాయి, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కుంభకోణాల్లో రాష్ట్రాన్ని జగన్ మొదటి స్థానంలో నిలిపాడు.

జగన్, భారతీరెడ్డి పీఏలను సీబీఐ విచారణకు పిలుస్తోంది!

అధికారం కోసం సొంత బాబాయిని జగన్ చంపించారు. భారతీరెడ్డి, జగన్ రెడ్డి పీఏలను సీబీఐ విచారణకు పిలుస్తోంది. మోదీని చూస్తే జగన్ రెడ్డికి కేసులు తప్ప హోదా గుర్తు రావడం లేదు. సొంత బాబాయిని చంపినవాడిని ఏమనాలి... సైకోనే అనాలి. తల్లి, చెల్లిని బయటకు తరిమినోడ్ని సైకోనే అంటారు. 

టీడీపీ అధికారంలోకి రాగానే గాలేరు-నగరి పూర్తి!

టీడీపీ అధికారంలోకి వచ్చాక గాలేరి-నగరిని పూర్తి చేస్తాం. నిరుద్యోగులకు మన నగరిలోనే ఇండస్ట్రియల్ పార్కు ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. బాబు అంటే బ్రాండ్... జగన్ అంటే జైలు. చంద్రబాబును చూస్తే పరిశ్రమలు వరుస కడతాయి. నగరికి పరిశ్రమలు తెచ్చే బాద్యత టీడీపీ తీసుకుంటుంది. చేనేత కార్మికులకు పక్క రాష్ట్రంతో దీటుగా 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే. 

అగ్నికుల క్షత్రియులకు కుల సర్టిఫికేట్లు ఇబ్బంది లేకుండా ఇప్పిస్తాం. నగరి నియోజవర్గంలో రెండు సార్లు టీడీపీ గెలవలేదు. మళ్లీ మనం ఇక్కడ గెలవాలి. ఉత్సాహ వంతుడు గాలి భానుప్రకాష్ ఉన్నాడు. దీవించి..మంచి మెజార్టీతో గెలిపించండి. నగరిలో అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.

నేటి పాదయాత్ర వివరాలు 

ఇప్పటివరకు నడిచిన దూరం 231.3 కి.మీ 
18వ రోజు నడిచిన దూరం 12.2 కి.మీ  
===== 
రేపటి పాదయాత్ర షెడ్యూలు వివరాలు 
14-2-2023 (మంగళవారం) 
సత్యవేడు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా 
ఉదయం  
8.00 – విత్తలతడుకు (నారాయణవరం మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం. 
8.15 – వెదురు కళాకారులతో ముఖాముఖి సమావేశం. 
9.35 – గోవిందప్ప కండ్రిగలో స్థానికులతో మాటామంతీ. 
10.15 – అరణ్యం కండ్రిగలో దాసరి, పద్మశాలి సామాజికవర్గీయులతో సమావేశం. 
11.10 – కృష్ణంరాజుల కండ్రిగలో స్థానికులతో మాటామంతీ. 
11.55 – తుంబూరులో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం 
12.25 – ఐఆర్ కండ్రిగలో భోజన విరామం. 
సాయంత్రం 
2.30 – పలమనగళంలో ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి. 
5.00 – కీలపూడి (పిచ్చాటూరు మండలం)లో బహిరంగసభలో ప్రసంగం. 
6.00 – కీలపూడి విడిది కేంద్రంలో బస.

More Telugu News