Smrithi Mandhana: ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ వేలం... రూ.3.4 కోట్లు పలికిన స్మృతి మంధన

  • భారత్ లో మహిళా ప్రీమియర్ లీగ్
  • నేడు ఆటగాళ్ల వేలం ప్రక్రియ 
  • స్మృతి మంధనను కొనుగోలు చేసిన ఆర్సీబీ
  • ఆసీస్ ఆల్ రౌండర్ గార్డనర్ కు రూ.3.2 కోట్లు
  • గార్డనర్ ను కొనుగోలు చేసిన గుజరాత్ జెయింట్స్
Smrithi Mandhana grabs huge price in WPL Players Auction

ఐపీఎల్ తరహాలో భారత్ లో తొలిసారిగా పూర్తిస్థాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మహిళా ప్రీమియర్ లీగ్ పోటీల కోసం నేడు ముంబయిలో ఆటగాళ్ల వేలం నిర్వహిస్తున్నారు. ఈ వేలం ప్రక్రియ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. 

భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధనకు భారీ ధర లభించింది. వేలంలో స్మృతిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ రూ.3.4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఈ ఎడమచేతివాటం ఓపెనర్ ప్రారంభ ధర రూ.50 లక్షలు కాగా... ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీలు ఆమె కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి స్మృతిని ఆర్సీబీ ఎగరేసుకెళ్లింది. 

ఇక, టీమిండియా మహిళల జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ ను ముంబయ ఇండియన్స్ రూ.1.8 కోట్లకు దక్కించుకుంది. విదేశీ క్రికెటర్లలో ఆష్లే గార్డనర్ భారీ ధర పలికింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గార్డనర్ ను రూ.3.2 కోట్లతో గుజరాత్ జెయింట్స్ చేజిక్కించుకుంది.

వేలం వివరాలు...

  • సోఫీ డివైన్- రూ.50 లక్షలు (ఆర్సీబీ)
  • హేలీ మాథ్యూస్- కనీస ధర రూ.40 లక్షలు (ఎవరూ కొనుగోలు చేయలేదు)
  • ఎలిస్ పెర్రీ- రూ.1.7 కోట్లు (ఆర్సీబీ)
  • సోఫీ ఎకెల్ స్టోన్- రూ.1.8 కోట్లు (యూపీ వారియర్స్)

More Telugu News