NVSS Prabhakar: అసెంబ్లీ సమావేశాలను రాజకీయ సభలుగా మార్చేశారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

NVSS Prabhakar says they turned assembly sessions into political meetings
  • అసెంబ్లీ సమావేశాల చివరిరోజున సీఎం కేసీఆర్ ప్రసంగం
  • మన్మోహన్ ను పొగడడం దేనికి సంకేతమన్న ఎన్వీఎస్ఎస్
  • తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిందని వెల్లడి
  • బీజేపీ ఆట షురూ అయిందని వ్యాఖ్యలు 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరిరోజున సీఎం కేసీఆర్ ప్రసంగం నేపథ్యంలో, బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శనాస్త్రాలు సంధించారు. అసెంబ్లీ సమావేశాలను రాజకీయ సభలుగా మార్చేశారని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్ ను పొగడడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎంఐఎంలతో బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం బయటపడిందని అన్నారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిందని, బీజేపీ ఆట మొదలైందని ఎన్వీఎస్ఎస్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఎవరు ఇంటికి పోతారు, ఎవరు అందలం ఎక్కుతారో అందరూ చూస్తారని వ్యాఖ్యానించారు. 

గవర్నర్ల బదిలీపై కూడా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అత్యున్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తులకు, విలువలు, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచినవారికి గవర్నర్ గా అవకాశం దక్కుతుందని, అంతటి గౌరవనీయ గవర్నర్ల బదిలీలను కూడా విమర్శించే స్థాయికి రాజకీయనేతలు దిగజారారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఒక గిరిజన స్త్రీని రాష్ట్రపతిని చేసినా గానీ విమర్శిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News