Ram Charan: రామ్ చరణ్ ను చూసి తీవ్ర భావోద్వేగాలకు గురైన బాలుడు... వీడియో ఇదిగో!

Boy gets emotional after seeing his favorite hero Ram Charan
  • రామ్ చరణ్ ను చూసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలుడు
  • తన అభిమాన హీరోను చూశాక కన్నీటిపర్యంతం
  • వివరాలు అడిగి తెలుసుకున్న రామ్ చరణ్
  • అతడిని క్షేమంగా ఊరికి పంపించాలంటూ సిబ్బందికి సూచన
అభిమానులను ప్రేమగా ఆదరించే టాలీవుడ్ హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. అవసరాల్లో ఉన్న ఫ్యాన్స్ ను ఆదుకోవడమే కాదు, తనను కలిసేందుకు వచ్చిన వారిని నిరుత్సాహపరచడని రామ్ చరణ్ కు గుర్తింపు ఉంది. కాగా, హైదరాబాదులో రామ్ చరణ్ తన ఫ్యాన్స్ తో సమావేశం నిర్వహిస్తున్నాడని తెలిసి ఓ బాలుడు సుదూర ప్రాంతం నుంచి వచ్చాడు. ఆ యువ అభిమాని తన ఆరాధ్య హీరో రామ్ చరణ్ ను చూశాక తీవ్ర భావోద్వేగాలకు లోనై కన్నీటిపర్యంతమయ్యాడు. 

ఆ కుర్రాడిని రామ్ చరణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుర్రాడు తిరిగి తన స్వస్థలానికి వెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకోవాలంటూ తన సిబ్బందికి పురమాయించారు. అంతేకాదు, ఆ బాలుడితో ఫొటో దిగి సంతోషపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
Ram Charan
Fan
Meeting
Hyderabad
Tollywood

More Telugu News