మైదానంలోనే ప్రత్యర్థులు.. మ్యాచ్ ముగియగానే స్నేహితులైపోయిన భారత్, పాక్ క్రికెటర్లు
- మహిళల టీ20 ప్రపంచ కప్ లో నిన్న రాత్రి భారత్, పాకిస్థాన్ మ్యాచ్
- 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
- ఆట పూర్తవగానే ఒక్కచోటకు చేరి సరదాగా గడిపిన క్రికెటర్లు
మైదానంలో నువ్వా? నేనా? అన్నట్టు తలపడ్డ భారత్, పాకిస్థాన్ క్రికెటర్లు ఆట అనంతరం స్నేహితులుగా మారిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల క్రీడాకారులంతా స్టేడియంలో ఒక్క చోటుకు చేరారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. జోకులు వేసుకుంటూ హాయిగా నవ్వుకున్నారు. ఇరు దేశాల కెప్టెన్లు తమ జెర్సీలను ఒకరికొకరు బహుమతిగా ఇచ్చుకున్నారు. తాము మైదానంలోనే ప్రత్యర్థులమని, ఆట ముగిశాక స్నేహితులం అని నిరూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.