sweet corn vendor: ముఖ్య అతిథిగా స్వీట్ కార్న్ వెండర్.. ఆనంద్ మహీంద్రా ఆకాంక్ష

Anand Mahindra wants to invite this sweet corn vendor as a guest at Mahindra Percussion Festival
  • స్వీట్ కార్న్ తయారీదారుడి కళాభిరుచి చూసి పరవశించిన ఆనంద్ మహీంద్రా
  • భారత్ హృదయ స్పందనకు సజీవ సాక్ష్యం అంటూ ట్వీట్
  • బెంగళూరులో మహీంద్రా పర్కుషన్ ఫెస్టివల్ కు అతడ్ని ఆహ్వానించాలన్న అభిలాష
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రతిభ కలిగిన వారిని గౌరవించడమే కాకుండా ప్రోత్సహిస్తుంటారు. ఓ స్వీట్ కార్న్ తయారీ వర్తకుడి పనితీరును చూసిన ఆనంద్ మహీంద్రా.. దాన్ని మెచ్చుకుంటూ తన ట్విట్టర్ పేజీలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఏ షాపులో ఇతడు పనిచేస్తాడో నాకు తెలియదు. కానీ, త్వరలో బెంగళూరులో జరగబోయే మహీంద్రా పర్కుషన్ ఫెస్టివల్ కు అతడు గౌరవ ఆహ్వాననీయుడు. భారత దేశ హృదయ స్పందనకు అతడు సజీవ సాక్ష్యం’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

స్వీట్ కార్న్ తయారీని ఓ పని మాదిగా కాకుండా, దాన్ని కళ మాదిరిగా భావిస్తూ, గరిటెతో వాయిస్తూ తయారు చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. ఆనంద్ మహీంద్రాని సైతం ఇదే అంశం కట్టిపడేసింది. అందుకే అతడ్ని ఆహ్వానించాలని ఆనంద్ మహీంద్రాకి అనిపించింది. బెంగళూరులో మార్చి 18న మహీంద్రా పర్కుషన్ ఫెస్టివల్ (సంగీతం) కార్యక్రమం జరగనుంది.
sweet corn vendor
Anand Mahindra
invite
bengalore festival

More Telugu News