Nayanthara: నయనతార ఇంటికి అనుకోని అతిథి!

Shah Rukh Khan visits Nayanthara and her twin boys at her Chennai apartment blows flying kisses
  • చెన్నైలో విఘ్నేశ్-నయనతార దంపతులను కలుసుకున్న షారుఖ్ 
  • పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు
  • ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్లిపోయిన ‘పఠాన్’
చైన్నైలో నయనతార, విఘ్నేశ్ శివన్ ఇంటికి ఓ ముఖ్య అతిథి అనుకోకుండా వచ్చి ఆశ్చర్యపరిచారు. ఆయనే బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్. విఘ్నేశ్, నయనతార గతేడాది వివాహం చేసుకోవడం, ఆ వెంటనే సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం తెలిసిందే. దీంతో నయనతార పిల్లలను చూసేందుకు షారుఖ్ విచ్చేసినట్టు తెలిసింది. 

నయనతార ఇంటికి షారుఖ్ వచ్చిన సమాచారం తెలియడంతో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం షారుఖ్ ఖాన్ నయనతారతో కలసి ఇంటి బయటకు వచ్చేశారు. అభిమానులకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. నయనతార చెక్కిలిపై షారుఖ్ ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. షారుఖ్, నయనతార 'జవాన్' అనే సినిమాలో కలసి నటిస్తుండడం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది జూన్ లో విడుదల కానుంది. షారుఖ్ నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తూ రూ.1,000 కోట్ల వసూళ్ల సమీపానికి చేరుకోవడం తెలిసిందే.
Nayanthara
vignesh sivan
Shah Rukh Khan
visits
Chennai

More Telugu News