వెలమ కులద్రోహి అయ్యన్నపాత్రుడు: టీడీపీ రెబెల్ నేత శ్రీరామ్మూర్తి
- కులం మీద బతికే వ్యక్తి అయ్యన్న అంటూ శ్రీరామ్మూర్తి విమర్శ
- తనను రాజకీయంగా ఎదగనీయడం లేదని మండిపాటు
- ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినా ఎమ్మెల్సీగా గెలుస్తానని ధీమా
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉండటం వల్లే అయ్యన్నపాత్రుడు తనపై కక్ష సాధిస్తున్నారని శ్రీరామ్మూర్తి అన్నారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఉపాధ్యాయ సంఘాలు, పట్టభద్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అయ్యన్నది ఉత్తరాంధ్ర కాదని... ఆయనది కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని అల్లిపూడి గ్రామం అని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వలస నేతలు పాలిస్తున్నారని చెప్పే అర్హత అయ్యన్నకు లేదని చెప్పారు.