1908 నాటి హార్లీ డేవిడ్ సన్ బైక్.. వేలంలో రూ. 7.72 కోట్లు!
- లాస్ వేగాస్‌లో గత నెలలో వేలం
- సైకిల్‌ను పోలిన ఈ బైక్‌కు ‘స్ట్రాప్ ట్యాంక్’ అని పేరు
- బైక్‌లో ఇప్పటికీ చాలా వరకు ఒరిజనల్ పార్ట్స్
- ధరను ముందే ఊహించామన్న ‘మెకమ్ ఆక్షన్’
ఈ బైక్ పేరు ‘స్ట్రాప్ ట్యాంక్’. దీనికీ పేరు పెట్టడం వెనక ఓ కారణం ఉంది. దీని ఆయిల్, ఇంధన ట్యాంకులు సైకిలు ఫ్రేమ్‌పైన అమర్చారు కాబట్టే దానికి ఆ పేరు పెట్టారు. ప్రపంచంలో ఇలాంటివి 12 మాత్రమే ఉన్నాయి. 1907 నాటి స్ట్రాప్ ట్యాంక్ అప్పట్లో 7,15,000 డాలర్లకు అమ్ముడుపోయింది. తాజా స్ట్రాప్ ట్యాంక్ అంతకుమించిన ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.
ఈ బైక్‌లో ఇప్పటికీ చాలా వరకు ఒరిజినల్ పార్ట్స్ ఉండడం గమనార్హం. ఈ బైక్‌ను తాము బాగా మార్కెట్ చేసినట్టు మెకమ్ వేలంలోని మోటార్ సైకిల్ డివిజన్ మేనేజర్ గ్రెస్ ఆర్నాల్డ్ పేర్కొన్నారు. హార్లే అత్యంత ప్రసిద్ధి చెందిన అమెరికన్ మోటార్ సైకిల్ బ్రాండ్ కాబట్టి వేలంలో మంచి ధర పలుకుతుందని ఊహించినట్టు చెప్పారు.