Team India: మహిళల టీ20 వరల్డ్ కప్: భారత్ పై టాస్ గెలిచిన పాకిస్థాన్

Team India put into fielding after Pakistan won the toss in T20 World Cup
  • దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 ప్రపంచకప్
  • కేప్ టౌన్ వేదికగా దాయాదుల సమరం
  • మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్
  • స్మృతి మంధన లేకుండానే బరిలో దిగిన భారత్
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా నేడు ప్రస్థానం ఆరంభిస్తోంది. అది కూడా తొలి మ్యాచ్ ను దాయాది దేశం పాకిస్థాన్ తో ఆడుతోంది. ఈ మ్యాచ్ కు కేప్ టౌన్ ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. 3 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 1 వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.

టీమిండియాకు హర్మన్ ప్రీత్ కెప్టెన్సీ వహిస్తుండగా, పాకిస్థాన్ జట్టుకు బిస్మా మారూఫ్ సారథ్యం వహిస్తోంది. కాగా, ఈ మ్యాచ్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఫిట్ నెస్ సమస్యలతో దూరమైంది. ప్రాక్టీసు మ్యాచ్ సందర్భంగా ఆమె గాయపడింది. ఆమె స్థానంలో హర్లీన్ డియోల్ కు తుది జట్టులో స్థానం కల్పించారు.

టీమిండియా...
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్.

పాకిస్థాన్...
బిస్మా మారూఫ్ (కెప్టెన్), మునీబా అలీ (వికెట్ కీపర్), జవేరియా ఖాన్, నిదా దార్, సిద్రా అమీన్, అలియా రియాజ్, ఆయేషా నసీమ్, ఫాతిమా సనా, అయిమాన్ అన్వర్, నష్రా సంధూ, సాదియా ఇక్బాల్.
Team India
Pakistan
Toss
T20 World Cup
Cape Town
South Africa

More Telugu News