BRS: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్​గా బండా ప్రకాశ్​ ఎన్నిక ఏకగ్రీవం

  • అభినందించిన సీఎం కేసీఆర్
  • ప్రకాశ్ ఈ పదవి చేపట్టడం అందరికీ గర్వకారణం అని వ్యాఖ్య
  • ముదిరాజ్ ల అభివృద్ధికి కృషి చేశారన్న సీఎం కేసీఆర్
Banda Prakash elected as Deputy Chairman of Telangana Legislative Council unanimous

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరిగింది. ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ ను సీఎం కేసీఆర్ అభినందించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మండలిలో డిప్యూటీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. 

ప్రకాశ్ ఈ పదవి చేపట్టడం అందరికీ గర్వకారణం అన్నారు. సామాన్య కుటుంబం నుంచి ప్రకాశ్ ఎదిగారని, ముదిరాజ్ ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 1981లో మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన బండా ప్రకాశ్ 2017లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు.

More Telugu News