Telangana: జీహెచ్ఎంసీలో భారీగా అంగన్ వాడీ పోస్టులు..

  • ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న మంత్రి హరీశ్ రావు
  • అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి హరీశ్ ప్రసంగం
  • బస్తీల సుస్తీ పోగొట్టేందుకే బస్తీ దవాఖానాలు ప్రారంభించారని సీఎంపై పొగడ్తలు
Telangana Govt to release Recruitment Notification for 1500 Asha worker Jobs under GHMC in by February end

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ సంఖ్యలో అంగన్ వాడీ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, వాటి భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం మంత్రి హరీశ్ రావు సభలో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఇందుకోసం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్ రావు జవాబిచ్చారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీల సుస్తీ పోగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ప్రారంభించారని మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్ పై పొగడ్తలు కురిపించారు. వీటిలో నిరుపేదలకు అద్భుతమైన సేవలందిస్తున్నట్లు వివరించారు. బస్తీ దవాఖానాలలో ప్రస్తుతం 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని, త్వరలోనే ఈ పరీక్షల సంఖ్యను 134 కు పెంచుతామని తెలిపారు.

ఇక చికిత్సలో భాగంగా రోగులకు 158 రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బస్తీ దవాఖానాల వల్ల పెద్దాసుపత్రులలో ఔట్ పేషెంట్ల రద్దీ తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు బస్తీ దవాఖానాలలో కోటి మందికి పైగా వైద్య సేవలు పొందారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

More Telugu News