Telangana: తెలంగాణలో కోటి కుటుంబాలు.. కోటిన్నర వాహనాలు

  • రాష్ట్రంలో కోటి 53 లక్షల వాహనాలున్నాయన్న రవాణా మంత్రి పువ్వాడ
  • ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో రూ. 231 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడి
  • త్వరలో 1360 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్న మంత్రి
one crore 53 lakh vehicles in Telangana says minister Ajay

తెలంగాణలో వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే కోటి 53 లక్షల వాహనాలు ఉన్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అసెంబ్లీలో చెప్పారు. రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 231 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. రాష్ట్రంలో 26 ఆర్టీసీ డీపోలు లాభాల్లోకి వచ్చాయని వెల్లడించారు. 

అయినప్పటికీ ఓవరాల్ గా ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతుందన్నారు. ఆర్టీసీకి ప్రతిరోజు 1.77 కోట్ల రూపాయల నష్టం వస్తోందని చెప్పారు. ఇక, ఆర్టీసీ కోసం ఈ ఏడాది 776 కొత్త బస్సులు ఆర్డర్ చేసినట్టు వెల్లడించారు. త్వరలో 1360 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపాదికన అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ముగియనున్నాయి.

More Telugu News