Yashwant Vitthal Mane: మహారాష్ట్ర ఎమ్మెల్యేకు యువకుడి అభ్యంతరకర వీడియో కాల్.. రూ. లక్ష ఇవ్వాలని బెదిరింపు

Man held for trying to extort money from NCP MLA Yashwant Mane
  • ఎమ్మెల్యే యశ్వంత్ విఠల్‌కు వీడియో కాల్ చేసిన నిందితుడు
  • రూ. లక్ష ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరిక
  • నిందితుడిని రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన అస్లాంఖాన్‌గా గుర్తింపు
  • అతడి ఫోన్‌లో 90కిపైగా అశ్లీల వీడియోలు
మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అభ్యంతరకర వీడియో కాల్ చేసిన ఓ యువకుడు డబ్బుల కోసం బెదిరించాడు. ప్రస్తుతం కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మొహోల్ నియోజకవర్గ ఎన్‌సీపీ ఎమ్మెల్యే యశ్వంత్ విఠల్ మానేకు అభ్యంతరకర రీతిలో వీడియో కాల్ చేసిన ఓ యువకుడు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

దీంతో ఎమ్మెల్యే యశ్వంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన రిజ్వాన్ అస్లాం ఖాన్‌గా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో 90కిపైగా అశ్లీల వీడియో ఉన్నట్టు గుర్తించారు.
Yashwant Vitthal Mane
Maharashtra
NCP
Crime News

More Telugu News