Blinkit: బ్లింకిట్ లో ఆర్డర్.. బ్రెడ్ ప్యాకెట్ లో ఎలుక

Man Tweets Photo Of Rat Inside Bread Packet Ordered From Blinkit
  • నితిన్ అరోరా అనే వ్యక్తికి ఎదురైన చేదు అనుభవం
  • డెలివరీ చేసిన బ్రెడ్ ప్యాకెట్ లో కదులుతున్న ఎలుక
  • ట్విట్టర్ లో షేర్.. స్పందించిన బ్లింకిట్
ఆర్డర్ చేసిన వెంటనే 10-20 నిమిషాల్లోపే తీసుకొచ్చి మన చేతికి ఇవ్వడం, లేదంటే గుమ్మం ముందు పెడుతుంది బ్లింకిట్. అంతా బాగానే ఉంది. కానీ, వేగం కోసమని అసలు ఏమి డెలివరీ చేస్తున్నామో? చూసుకోలేని స్థితిలో బ్లింకిట్ సిబ్బంది ఉన్నారంటే నిజంగా బాధపడాల్సిందే. 

నితిన్ అరోరా అనే వ్యక్తి బ్లింకిట్ లో గ్రోసరీ ఆర్డర్ చేశాడు. అందులో బ్రెడ్ ప్యాకెట్ కూడా ఒకటి. బ్లింకిట్ ఎగ్జిక్యూటివ్ డెలివరీ చేసి వెళ్లిపోయాడు. తెరిచి చూసిన అరోరాకు కళ్లు బైర్లు కమ్మాయి. బ్రెడ్ ప్యాకెట్ లోకి ఎలుక దూరి అక్కడి నుంచి బయటకు రాలేక అలాగే ఉండిపోయింది. ఫిబ్రవరి 1న ఈ ఘటన జరిగింది. తనకు ఎంతో అసౌకర్యమైన అనుభవం ఎదురైనట్టు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. 

‘‘ఇది మనకు హెచ్చరిక వంటిది. 10 నిమిషాల డెలివరీలో అలాంటివి ఉండేట్టు అయితే, నేను గంటల కొద్దీ వేచి చూడడానికి వెనుకాడను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి బ్లింకిట్ టీమ్ కూడా వెంటనే స్పందించింది. ఇలాంటి అనుభవం మీకు ఇవ్వాలని అనుకోవడం లేదంటూ ఫోన్ నంబర్ షేర్ చేయాలని కోరింది. ఆలస్యం అయినా ఫర్వాలేదు కానీ, సురక్షితమైన ఫుడ్ డెలివరీ చేయాలంటూ ఓ నెటిజన్ సూచించాడు. కఠిన చర్య తీసుకున్నామని, పార్ట్ నర్ ను తమ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించామని బ్లింకిట్ కస్టమర్ సపోర్ట్ హెడ్ సైతం స్పందించారు.
Blinkit
bread
live rat
bread packet

More Telugu News