K Vishwanath: విశ్వనాథ్ ను తలచుకుని ఏడ్చేసిన 'సప్తపది' హీరోయిన్!

Sapthapadi Sabitha Interview
  • 'సప్తపది' సినిమాతో పరిచయమైన సబిత 
  • విశ్వనాథ్ తో ఉన్న పరిచయం గురించిన ప్రస్తావన 
  • ఆయనను తరచూ కలుస్తూ ఉండేదానినని వెల్లడి
  • ఆ సినిమాలో చేయడం తన అదృష్టమని వివరణ

కె. విశ్వనాథ్ సినిమాలు చూసినవారు .. ఆయనతో కలిసి ఆ సినిమాలకి పనిచేసినవారు ఆయనను ఎప్పటికీ మరిచిపోలేరు. విశ్వనాథ్ సినిమాలు చూసినవారికి ఆయన ఒక దర్శకుడిగ కాకుండా మహర్షిలా కనిపిస్తారు. కళ కోసం తపస్సు చేస్తున్నట్టుగా అనిపిస్తారు. అందువల్లనే ఆయనను అంతా కళాతపస్వి అని గౌరవిస్తారు. 

ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో 'సప్తపది' ఒకటి. అందులో నాయిక పాత్రను పోషించిన సబిత మాట్లాడుతూ .. "నేను ఆ మధ్య కెనడా వెళుతూ అఆయనను కలిసే వెళ్లాను. తిరిగి వచ్చాక కూడా కలిశాను.  అయినా 'ఇంతకాలం ఎక్కడికి వెళ్లావు? అని ఆయన అడిగారు. మీఎకు చెప్పే వెళ్లాను గదా గురువుగారు అంటే, తనకి గుర్తులేదని అన్నారు" అని చెప్పుకొచ్చారు. 

'శంకరాభరణం' సినిమా ప్రివ్యూలో మొదటిసారిగా విశ్వనాథ్ గారిని చూశాను. తరువాత సినిమాకి మా ఫొటోలు పంపించమంటే పంపించాము. 'శుభోదయం' సినిమా కోసం ఆయాన అనుకుని ఉంటారు. కానీ నేను డాన్స్ ప్రధానమైన సినిమానే చేస్తానని అనడంతో, 'సప్తపది'లో అవకాశం ఇచ్చారు.

'సప్తపది'లో చేయడానికి కూడా నేను చాలా భయపడిపోయాను. కానీ విశ్వనాథ్ గారు ధైర్యం చెప్పి చేయించారు. సంగీతం .. సాహిత్యం .. గానం .. నాట్యం వీటన్నింటి గొప్ప కలయికతో కూడిన సినిమాను నాతో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనను చూడటానికి ఎప్పుడైనా వెళితే, మరోసారి ఈ సినిమాలోని డాన్స్ చేయించుకునేవారు" అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకునేవారు.  

  • Loading...

More Telugu News