Ostrich: చైనాలో ఆస్ట్రిచ్ వాహనాలు

  • నిప్పుకోడిని వాహనంగా ఉపయోగించుకుంటున్న తీరు
  • కోడిపై కూర్చుని స్కూల్ కు వెళుతున్న బాలిక
  • చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ లో దర్శనం
Girl Rides On Back Of Ostrich To School In China

నిప్పు కోళ్లను పెంచుకోవడం తెలుసు. అయితే, నిప్పు కోళ్లను వాహనాలుగానూ మార్చుకోవచ్చని చైనీయులు నిరూపిస్తున్నారు. చైనాలో ఓ చిన్నారి ఆస్ట్రిచ్ పక్షి వీపు భాగంలో ఎక్కి కూర్చోగా, అది దర్జాగా నడుస్తూ వెళుతోంది. ఆస్ట్రిచ్ పై కూర్చున్న చిన్నారి తన చేతితో దాని తలను తిప్పుతూ ఏ దిశలో వెళ్లాలన్నది సూచిస్తోంది.

స్కూల్ కు నిప్పుకోడిపై వెళుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. యున్నాన్ ప్రావిన్స్ పరిధిలోని దాలిలో నివసించే బాలిక ఫిబ్రవరి 6న స్కూల్ కి నిప్పుకోడితో వెళుతున్న సమయంలో ఈ వీడియో తీశారు. ఆ సమయంలో నిప్పుకోడి వెంట మరో వ్యక్తి కూడా ఉన్నాడు. స్కూల్ దగ్గర బాలిక దిగిన వెంటనే నిప్పుకోడి బయటకు వెళ్లిపోవడాన్ని గమనించొచ్చు. కొన్ని నెలల క్రితం కూడా ఇదే మాదిరి ఒక బాలిక నిప్పుకోడిపై వెళుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.

More Telugu News