Tamannaah: హైదరాబాద్‌లో అజా ఫ్యాషన్ స్టోర్ ప్రారంభం... ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమన్నా

Tamannaah attends Aza Fashion Store inauguration in Hyderabad
  • దేశంలో అగ్రగామి లగ్జరీ రిటైలర్ గా అజా ఫ్యాషన్స్ కు గుర్తింపు
  • తాజాగా హైదరాబాదులోనూ కాలుమోపిన అజా
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన తమన్నా
  • ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషం కలిగించిందన్న తమన్నా
భారత్ లో అగ్రగామి ఫ్యాషన్ లగ్జరీ రిటైలర్ గా పేరుపొందిన అజా ఫ్యాషన్స్ ఇప్పుడు హైదరాబాదులోనూ కాలు మోపింది. అజా ఫ్యాషన్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా విచ్చేశారు. అజా హైదరాబాద్‌ స్టోర్‌ని ప్రముఖ పారిశ్రామికవేత్త పింకీ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అజా వ్యవస్థాపకుడు, ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ అల్కా నిషార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దేవాంగి పరేఖ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఈ వేడుకలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ డిజైనర్లు నుపూర్‌ కనోయ్‌, మయూర్‌ గిరోత్రా, రితికా మీర్ చందానీ, షాహిల్‌ అనేజా, ధ్రువ్‌ వెయిష్‌, శ్రియా సోమ్‌ ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. 

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ, హైదరాబాద్‌లో సరికొత్త అజా ఫ్యాషన్ స్టోర్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. తనను ఆహ్వానించినందుకు డాక్టర్ అల్కా నిషార్, దేవాంగి పరేఖ్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అధునాతనమైన ఈ స్టోర్ హైదరాబాద్‌లోని లగ్జరీ షాపర్‌లకు గొప్ప షాపింగ్‌ అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు.
Tamannaah
Aza Fashion Store
Hyderabad
Inauguration

More Telugu News