Brijendra Singh Yadav: మధ్యప్రదేశ్ మంత్రిపై దురద కలిగించే పౌడర్ చల్లిన వ్యక్తి... వీడియో ఇదిగో!

Man throws itching powder on Madhya Pradesh minister Brijendra Singh Yadav
  • మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఘటన
  • బీజేపీ ఆధ్వర్యంలో రథయాత్ర
  • పాల్గొన్న మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్
  • దురదతో విపరీతంగా గోక్కున్న మంత్రి 
ఇలాంటి దాడులు కూడా చేస్తారా అనిపించేలా మధ్యప్రదేశ్ లో ఓ సంఘటన జరిగింది. రథయాత్రలో పాల్గొన్న మంత్రిపై ఓ వ్యక్తి దురద కలిగించే పౌడర్ చల్లాడు. భోపాల్ లో బీజేపీ ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ కూడా పాల్గొన్నారు. రథయాత్ర సాగుతుండగా ఓ వ్యక్తి మంత్రిని లక్ష్యంగా చేసుకుని దురద పుట్టించే పౌడర్ చల్లాడు. దాంతో, మంత్రి గోక్కోవడం మొదలుపెట్టారు. 

దురద ఎంతకీ తగ్గకపోగా, ఇంకా అధికం కావడంతో కుర్తా విప్పేశారు. సిబ్బంది అందించిన నీళ్లతో శరీరంపై పౌడర్ పడిన చోట శుభ్రంగా కడుక్కున్నారు. అనంతరం తన దురద బాధను అక్కడున్నవారికి నవ్వుతూ వివరించగా, వారు కూడా ఆయనతో కలిసి నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Brijendra Singh Yadav
Itching Powder
Bhopal
BJP
Madhya Pradesh

More Telugu News