Akash Chopra: ఇండియాను ఇండియాలో ఓడించే సత్తా పాకిస్థాన్ కు మాత్రమే ఉందన్న ఆ దేశ ఫ్యాన్ కు ఆకాశ్ చోప్రా చురక

Akash Chopra dig at Pak fan for claiming Pak only could beat India in India
  • సొంత గడ్డపై వరుస విజయాలను సాధిస్తున్న టీమిండియా
  • ఇండియాను ఓడించే సత్తా మాకే ఉందన్న పాక్ అభిమాని
  • ముందు మీ సొంత గడ్డపై గెలవండి అంటూ ఆకాశ్ చోప్రా చురక
సొంత గడ్డపై టీమిండియా వరుస విజయాలను సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కూడా భారత్ జోరు మీద ఉంది. నిన్న ప్రారంభమైన ఈ టెస్టులో తొలి రోజున ఆస్ట్రేలియా జట్టును కేవలం 177 పరుగులకే ఇండియా కట్టడి చేసింది. ఆ తర్వాత నిన్న తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 56 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇండియాను ఇండియాలో ఓడించే ఉత్తమ అవకాశం తడిగా ఉన్న తారాజువ్వలా మారితే ఎలా ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై పాకిస్థాన్ కు చెందిన తల్లా హెజాజ్ అనే అభిమాని స్పందిస్తూ... భారత్ ను భారత్ లో ఓడించే సత్తా కేవలం పాకిస్థాన్ కు మాత్రమే ఉందని చెప్పారు. దీనికి సమాధానంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ... మీ ఆశాభావాన్ని ఇష్టపడుతున్నానని... అయితే, ముందు మీ గడ్డపై సిరీస్ లను గెలవండి అంటూ చురక అంటించాడు.
Akash Chopra
Team India
Pakistan

More Telugu News