తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన నందమూరి కల్యాణ్ రామ్

  • తారకరత్న కోలుకుంటున్నారన్న కల్యాణ్ రామ్
  • త్వరలోనే పూర్తిగా కోలుకుంటారనే నమ్మకం ఉందని వ్యాఖ్య
  • బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న
Tarakaratna is recovering says Kalyan Ram

సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఆయన కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు, సినీ హీరో కల్యాణ్ రామ్ స్పందించారు. తారకరత్న కోలుకుంటున్నారని చెప్పారు. ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వడానికి తాను మెడికల్ ఎక్స్ పర్ట్ ను కాదని అన్నారు. ఎక్స్ పర్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో తారకరత్న త్వరగానే పూర్తిగా కోలుకుంటారనే నమ్మకం తనకుందని చెప్పారు. తన తాజా చిత్రం 'అమిగోస్' విడుదల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కల్యాణ్ రామ్ ఈ మేరకు స్పందించారు.

More Telugu News