ఫోన్ ట్యాప్ కాలేదని కోటంరెడ్డి స్నేహితుడు చెపుతున్నారు కదా!: మంత్రి కాకాణి

  • ప్రభుత్వంపై బురద చల్లడమే కోటంరెడ్డి పనిగా పెట్టుకున్నారని కాకాణి మండిపాటు
  • చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి పడ్డారని వ్యాఖ్య
  • వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా
Kotamreddy friend telling that phone not tapped says Kakani

నెల్లూరు జిల్లాలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. తాజాగా కోటంరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కాలేదని కోటంరెడ్డి స్నేహితుడు శివారెడ్డి చెపుతున్నారని... అయినా ప్రభుత్వంపై కోటంరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 

ఆడియో రికార్డ్ ను ఫోన్ ట్యాప్ అంటున్నారని విమర్శించారు. అది ఫోన్ టాప్ కాదని... చంద్రబాబు ట్రాప్ అని అన్నారు. కోటంరెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని విమర్శించారు. అండగా నిలిచిన పార్టీకి కోటంరెడ్డి మోసం చేశారని అన్నారు. వాపును చూసుకుని బలుపు అనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని అన్నారు.

More Telugu News