లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • వరుసగా రెండో రోజు లాభాలు
  • 142 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 22 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 142 పాయింట్లు లాభపడి 60,806కి పెరిగింది. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 17,893కి చేరుకుంది. ఇన్ఫోసిన్, బజాజ్ ఫైనాన్స్ వంటి బ్లూచిప్ కంపెనీలు లాభాలను ముందుండి నడిపించాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.30%), ఏసియన్ పెయింట్స్ (1.89%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.81%), ఇన్ఫోసిస్ (1.76%), బజాజ్ ఫైనాన్స్ (1.59%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-1.03%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.92%), టాటా మోటార్స్ (-0.80%), సన్ ఫార్మా (-0.65%), యాక్సిస్ బ్యాంక్ (-0.49%).

More Telugu News