'అమిగోస్' చూసిన ఎన్టీఆర్ ఇదేమాట చెప్పాడట!

  • 'అమిగోస్' ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ 
  • ఈ కథ రొటీన్ కి భిన్నమని చెప్పిన కల్యాణ్ రామ్ 
  • ఎన్టీఆర్ ఈ సినిమాను చూశాడని వెల్లడి 
  • హిట్ అవుతుందని చెప్పారని వ్యాఖ్య
  • రేపు విడుదలవుతున్న సినిమా     
Amigos movie update

రాజేంద్ర అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, కల్యాణ్ రామ్ 'అమిగోస్' అనే సినిమాను చేశాడు. మైత్రీవారు నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 10వ తేదీన భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. 

ఈ ప్రెస్ మీట్ లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "మైత్రీ నా హోమ్ బ్యానర్ వంటిదే. రొటీన్ కి భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ  సినిమా చేశాను .. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. ఒక దర్శకుడిగా రాజేంద్రగారు ఎంతగా కష్టపడ్డాడనేది నేను చూశాను. ఈ సినిమాను ఆయన పేరెంట్స్ కి అంకితం చేస్తున్నాము" అన్నాడు.

నిర్మాతలు మాట్లాడుతూ .. ఈ రోజు ఉదయమే ఎన్టీఆర్ గారు ఈ సినిమాను చూశారు .. పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. 'బింబిసార' చూసిన తరువాత ఆయన చెప్పిన మాటనే నిజమైంది. అలాగే ఈ సినిమా కూడా ఆయన చెప్పినట్టుగానే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News