చైనా స్పై బెలూన్ ను కూల్చేశారిలా.. వీడియో ఇదిగో !

  • ఫిబ్రవరి 4న బెలూన్ ను పేల్చేసిన అమెరికా
  • రెండు ఫైటర్ జెట్లను పంపించి టాస్క్ పూర్తిచేసినట్లు వివరణ
  • తాజాగా వీడియో ఫుటేజీని విడుదల చేసిన అధికారులు
US fighter jet Lockheed Martin F 22 Raptor shoots down Chinese spy balloon

అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా స్పై బెలూన్ ను అగ్రరాజ్యం ఫైటర్ జెట్ లు కూల్చేశాయి. ఇందుకోసం చైనా బెలూన్ కదలికలను అధికారులు దాదాపు నాలుగు రోజుల పాటు నిశితంగా పరిశీలించారు. బెలూన్ ను కూల్చివేస్తే శకలాలు జనావాసాలపై పడే ప్రమాదం ఉండడంతో సమయం కోసం వేచి ఉన్నట్లు చెప్పారు. శిథిలాలు జనావాసాలపై కూలే ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఈ నెల 4న రెండు ఫైటర్ జెట్లను పంపించి బెలూన్ ను కూల్చేసినట్లు తెలిపారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేశారు. ప్రస్థుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అత్యాధునిక జెట్ ఫైటర్ లక్ష్యం వైపు బయలుదేరిన క్షణం నుంచి క్షిపణిని ప్రయోగించి బెలూన్ ను ధ్వంసం చేసిన క్షణం దాకా ఈ వీడియోలో రికార్డయింది. కాగా, బెలూన్ దాదాపు 60 మీటర్ల పొడవు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలోడ్ భాగం వేల పౌండ్ల బరువు ఉంటుందని వివరించారు. అట్లాంటిక్ సముద్రంలో పడిన బెలూన్ శిథిలాలను నేవీ అధికారులు ఇప్పటికే వెలికి తీశారు. ఆ పరికరాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.

More Telugu News