BJP: ఆ నలుగురు కలెక్టర్లపై ఫిర్యాదుకు సిద్ధమైన బండి సంజయ్

Bandi Sanjay is ready to file a complaint against the four collectors
  • తెలంగాణలో నలుగురు కలెక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు
  • ధరణి పేరుతో పేదల భూములు సీఎం కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారని ఆరోపణ
  • ఆధారాలు సేకరించి డీవోపీటీ అపాయింట్ మెంట్ కోరిన వైనం
తెలంగాణకు చెందిన నలుగురు కలెక్టర్లపై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారిపై ఫిర్యాదు చేయనున్నారు. ధరణి పేరుతో ఆ కలెక్టర్లు పేదల భూములను లాక్కొని సీఎం కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారని సంజయ్ ఆరోపణలు చేశారు. ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. వారి బండారం బయట పెడతానని అన్నారు. ఆ నలుగురు కలెక్టర్లపై పక్కా ఆధారాలు సంపాదించిన సంజయ్ ఢిల్లీ వెళ్లారు. బుధవారం లోక్ సభకు హాజరయ్యారు. తన వద్ద ఉన్న ఆధారాలతో వారిపై ఫిర్యాదు చేసేందుకు డీవోపీటీ అధికారుల అపాయింట్ కోరినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు డీవోపీటీ ఉన్నతాధికారుల నుంచి పిలుపు వస్తుందని తెలుస్తోంది. ఫిర్యాదు తర్వాత సదరు కలెక్టర్లు ఎవరు అనే వివరాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది.
BJP
Bandi Sanjay
collectrors
dopt
complaints

More Telugu News