హైదరాబాద్ నేచర్ క్యూర్ ఆసుపత్రిలో సోనూసూద్.. వీడియో ఇదిగో!

  • ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించిన బాలీవుడ్ నటుడు
  • వైద్యులతో కలిసి సంపంగి మొక్కను నాటిన సోనూసూద్
  • సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై ప్రశంసలు 
Actor Sonu Sood visits Nature Cure Hospital In Hyderabad

బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురువారం హైదరాబాద్ లోని ప్రకృతి చికిత్సాలయం (నేచర్ క్యూర్ హాస్పిటల్) ను సందర్శించారు. ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ కాటేజీలు, మెస్, యోగా ప్రాంగణాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోనూసూద్ తో పాటు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆయూష్ కమిషనర్ ప్రశాంతిలతో పాటు నేచర్ క్యూర్ హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.

ఈ సందర్బంగా వైద్యులు, విద్యార్థులు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. సోనూసూద్ సంపంగి మొక్కను నాటారు. సోనూసూద్ తో సెల్ఫీల కోసం అక్కడ ఉన్నవారంతా పోటీపడ్డారు. అనంతరం వైద్యులు, విద్యార్థులను ఉద్దేశించి సోనూసూద్ మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు చాలా బాగుందని పేర్కొన్నారు. 

కరోనా కాలంలో ఇబ్బంది పడ్డ జనాలకు సోనూసూద్ ఆపన్న హస్తం అందించిన విషయం తెలిసిందే. తన ఆస్తులు తాకట్టు పెట్టి మరీ పేదలను ఆయన ఆదుకున్నారు. ఇప్పటికీ తన ఫౌండేషన్ ద్వారా యాక్టర్ సోనూసూద్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

More Telugu News