Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీడియా అధినేత అరెస్ట్

  • లిక్కర్ స్కామ్ లో వేగం పెంచిన ఈడీ
  • చారియట్ మీడియా సంస్థ అధినేత రాజేశ్ జోషి అరెస్ట్
  • గోవా ఎన్నికల్లో ఆప్ తరపున రాజేశ్ డబ్బు ఖర్చు చేశారన్న ఈడీ
Media owner arrested by ED in Delhi Liquor Scam

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. నిన్న ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ... ఈరోజు మరొక ప్రముఖుడిని అదుపులోకి తీసుకుంది. చారియట్ మీడియా సంస్థ అధినేత రాజేశ్ జోషిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో ముడుపులుగా తీసుకున్న డబ్బును గోవా ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసిందని ఈడీ ఇప్పటికే ఛార్జ్ షీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

చారియట్ మీడియా సంస్థ ద్వారా పెద్ద ఎత్తున గోవా ఎన్నికల్లో ఆప్ తరపున రాజేశ్ జోషి ఖర్చు చేశారని ఈడీ పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా రెండో ఛార్జ్ షీట్ లో ఈడీ చేర్చిన సంగతి తెలిసిందే. మరోవైపు నిన్న ఈడీ అరెస్ట్ చేసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కూడా ఉండటం కలకలం రేపుతోంది.

More Telugu News