‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్‌

  • మరో వివాదానికి తెరలేపిన నటుడు ప్రకాశ్ రాజ్
  • ‘కశ్మీర్ ఫైల్స్’ అర్థంపర్థం లేని సినిమా అంటూ కామెంట్
  • ఇంత జరిగినా వాళ్లకు సిగ్గురాలేదని విమర్శలు 
prakash raj says kashmir files is a nonsense film

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరో కాంట్రవర్సీకి తెరలేపారు. ‘కశ్మీర్‌ ఫైల్స్’ అర్థంపర్థం లేని సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేరళలో నిర్వహించిన మాతృభూమి ‘ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ’ కార్యక్రమంలో ఆయన కశ్మీర్ ఫైల్స్ ప్రస్తావన తెచ్చారు. 

‘‘అర్థంపర్థం లేని సినిమాల్లో కశ్మీర్ ఫైల్స్ కూడా ఒకటి. దాన్ని ఎవరు నిర్మించారో మనందరికీ తెలుసు. ఇది సిగ్గులేనితనం. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా దీన్ని పట్టించుకోలేదు. కానీ..వాళ్లకు సిగ్గు రాలేదు. నాకు ఆస్కార్ ఎందుకు రాలేదని ఆ సినిమా డైరెక్టర్ ఇప్పటికీ అంటున్నారు. ఆస్కార్ కాదు కదా.. ఆయనకు భాస్కర్ కూడా రాదు. ఇదో ప్రాపగాండా ఫిల్మ్. ఇలాంటి ప్రచార చిత్రాల్ని తీసేందుకు కొందరు 2000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు నాకు తెలిసిన వాళ్లు చెప్పారు. కానీ.. ప్రజల్ని ఎల్లప్పుడూ మోసపుచ్చలేరు’’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

More Telugu News